కేంద్రంపై భ‌గ్గుమ‌న్న సూర్య‌.. ఆ బిల్లుపై ఆగ్ర‌హం!

-

కేంద్ర ప్ర‌భ‌త్వం కొత్త‌గా తీసుకొచ్చిన సినిమాటోగ్రఫీని సవరించే బిల్లుపై ఇప్ప‌టికే సినీ సెల‌బ్రిటీలు పెద్ద‌ ఎత్తున నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. ఇప్ప‌టికే లోక నాయ‌కుడు అయిన క‌మ‌ల్ హాస‌న్ తీవ్ర అభ్యంతరాలు లేవ‌నెత్తారు. అయితే ఈ సినిమాటోగ్రఫీ సవర‌ణ బిల్లును 2019 ఫిబ్రవరి 12వ తేదీన అప్ప‌ట్లో శాసనసభలో తీసుకురాగా.. ఇప్పుడు ఏకంగా ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది కేంద్రం.

surya

అయితే ఈ సవరణ బిల్లు కింద ఒకసారి సెన్సార్ వ‌ర‌కు వెళ్లిన మూవీలు తిరిగి సెన్సార్ షిప్ కోసం అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దాంతో ఈ చ‌ట్టంపై సామాజిక కార్యకర్తల ద‌గ్గ‌రి నుంచి చాలామంది సినీ సెల‌బ్రిటీల వ‌ర‌కు తీవ్రంగా వ్యతిరేకంగా వ్య‌తిరేకిస్తున్నారు.

ఇక ఇప్పుడు తమిళ స్టార్ హీరో అయిన సూర్య కూడా ఈ చ‌ట్టాన్ని వ్య‌తిరేకించారు. త‌న ట్విట్టర్ ఖాతా వేదికగా చ‌ట్టంపై తీవ్ర అసహనం తెలిపారు. ఈ చ‌ట్టం భావ ప్రకటన స్వేచ్చను పరిమితం చేస్తోందని తెలిపారు. దీనిపై ప్ర‌తి ఒక్క‌రూ అభ్యంత‌రం తెల‌పాల‌ని కోరారు. ఇప్పటికే దీనిపై కమల్ హాసన్ కూడా వ్యతిరేకంగా త‌న వాయిస్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version