కేసీఆర్‌ ని గద్దె దింపడంలో రేవంత్ రెడ్డి లాజిక్ వర్కౌట్ అవుతుందా?

-

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) దూకుడు ప్రదర్శిస్తున్నారు. వరుసపెట్టి నాయకులని, కార్యకర్తలని కలుస్తూ పార్టీకి కొత్త ఊపు తెచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న నాయకులని బుజ్జగించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వంపై మళ్ళీ యుద్ధం మొదలుపెట్టారు. అటు బీజేపీని కూడా టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. అయితే కేసీఆర్‌ని గద్దె దింపడమే రేవంత్ అసలైన లక్ష్యమని చెబుతున్నారు.

నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గెలిపించి కేసీఆర్‌ని సీఎం పీఠం నుంచి దించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. అందుకే ఇప్పటినుంచే కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అసలు టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. అందుకు ఉదాహరణగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజీగూడ డివిజన్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడాన్ని చెబుతున్నారు. టీఆర్ఎస్-బీజేపీలు కలిసి పోటీ చేసినా కూడా ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించారని అంటున్నారు.

అలాగే నాగార్జున సాగర్ ఉపఎన్నికలో సెకండ్ ప్లేస్‌ వచ్చిందని, అక్కడ బీజేపీకి కేవలం ఏడు వేల ఓట్లే వచ్చాయని, కాబట్టి కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెసేనని ప్రజలు భావిస్తున్నారని అంటున్నారు. ఇంకా నెక్స్ట్ కేసీఆర్‌ని గద్దె ఎలా దిగుతారో కూడా రేవంత్ ఓ లాజిక్ చెబుతున్నారు. 1994 నుంచి పదేళ్లపాటు టీడీపీ అధికారంలో ఉంటే.. 2004 నుంచి పదేళ్లపాటు కాంగ్రెస్‌ పాలన సాగిందని, 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ 2023 వరకూ ఉండనుందని చెబుతున్నారు.

ఇక గత అనుభవాలు, తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే ప్రభుత్వాన్ని మార్చాలన్న ప్రజల నిర్ణయం ఇప్పటికే జరిగిపోయిందని గట్టిగా నమ్మకంతో ఉన్నారు. అయితే రేవంత్ చెప్పిన లాజిక్ కరెక్టే. గతంలో పదేళ్ళకొకసారి ప్రజలు ప్రభుత్వాలని మార్చేశారు. అలా చెప్పిన దాని ప్రకారం నెక్స్ట్ కేసీఆర్‌ని ప్రజలు గద్దె దించుతారో లేదో చూడాలి. మరి రేవంత్ చెప్పిన లాజిక్ ఏ మాత్రం వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version