ఒక‌ప్పుడు స్టార్ హీరో సీన్ రివ‌ర్స్‌… ప్లాపుల ఎఫెక్టేనా..

-

గజిని, ఆరు సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఆ తర్వాత సూర్య సన్నాఫ్ కృష్ణన్ – వీడొక్కడే – సింగం – 24 యముడు లాంటి సినిమాలతో తెలుగు లో తన మార్కెట్ విస్తరించుకున్నాడు. ఒక దశలో సూర్య సినిమా వస్తుందంటే తెలుగులో రైట్స్ సొంతం చేసుకునేందుకు అగ్ర నిర్మాతలు సైతం పోటీ పడేవారు. సూర్య సినిమాల‌కు తెలుగులో 25 నుంచి 28 కోట్ల వరకు బిజినెస్ జరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఈ మార్కెట్ నిలబెట్టుకోవడంలో సూర్య విఫలమయ్యాడు.

తన స్థాయికి తగిన సినిమాలు చేయడంతో పాటు సరైన కథలు ఎంచుకోక‌పోవడంతో తెలుగులో సూర్య మార్కెట్ పోయింది. సూర్య సినిమా రిలీజవుతుందంటే స్టార్ హీరోలు సైతం భయపడేవారు. అలాంటిది ఇప్పుడు చిన్నా చిత‌కా హీరోలు కూడా లెక్క చేయని పరిస్థితి వచ్చేసింది. ఈ సమ్మర్లో ఎన్జీకే అనే డిజాస్ట‌ర్‌ సినిమా చేసిన సూర్య ఆ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో తనకు ఉన్న తక్కువ మార్కెట్ను కూడా కోల్పోయాడు.


ఇక ఇప్పుడు సూర్య కొత్త సినిమా బందోబస్తు మీద తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం ఆసక్తి లేదు. తాజాగా జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చిన్న బోయింది. గతంలో మన స్టార్ హీరోల ఫ్యాన్స్ స్థాయిలో సూర్య కు అభిమానుల హడావుడి ఉండేది. ఇప్పుడు సూర్య‌ను అసలు పట్టించుకునే వారే కనపడటం లేదు. తాజా ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌కు సురేష్‌బాబు వ‌చ్చి రెండు మూడు మాట‌లు మాట్లాడేసి స‌రిపెట్టేశాడు.

గతంలో సూర్య సినిమా హక్కుల కోసం గట్టి పోటీ ఉండేది. అల్లు అరవింద్, యువి క్రియేషన్స్ వాళ్లు అతడికి సపోర్టుగా నిలిచి సినిమాల్ని రిలీజ్ చేసేవారు. ఇప్పుడు సూర్య సినిమాల‌ను ఎవ‌రు కొంటున్నారో తెలియ‌ని ప‌రిస్థితి వ‌చ్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version