మాకు రైతులతో ఉంది భావోద్వేగ బంధం.. సీఎం రేవంత్ ఎమోషనల్ కామెంట్స్

-

రైతులకు తమకు మధ్య ఉంది భావోద్వేగ బంధమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో రైతు భరోసా పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి మొదటి విడతలో భాగంగా రూ.6,034 కోట్ల ను విడుదల చేసామని వెల్లడించారు. మొత్తం 27 రోజుల్లో మూడు విడుతల వారిగా రూ.17వేల కోట్లు రుణమాఫీ చేసామని గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రూ.20,616 కోట్లు రుణమాఫీ చేసిన ఘటన తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కడుపు కట్టుకొని రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని ఫైర్ అయ్యారు. తమకు రైతులకు ఉంది.. భావోద్వేగ బంధం అన్నారు. రుణ మాఫీ చేసేందుకు తమ వద్ద నల్ల డబ్బు లేదంటూ గతంలో కేసీఆర్ అన్నారని గుర్తు చేసారు. అదానీ కి తిరిగి ఇచ్చిన రూ.100 కోట్లతో రాష్ట్రానికే నష్టం అని.. తనకు కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version