బీఆర్ఎస్ వాళ్లను ఉరి తీసినా తప్పు లేదు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ వాళ్లను ఉరి తీసినా తప్పు లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో రైతు భరోసా పై విధి విధానాల గురించి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 11.5 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి ప్రభుత్వం పై భారీ మోపిందన్నారు. అనేక బ్యాంకులు 2 నుంచి 4 శాతానికి అప్పులు ఇస్తుంటే వీళ్లు 11.5 శాతానికి అప్పు తీసుకొచ్చారు. వేలాది కోట్ల రూపాయలు కోట్లు వడ్డీలు కడుతున్నాం. ఇతర దేశాలలో ఇంత ఆర్థిక నేరానికి పాల్పడి ఉంటే ఉరి తీసి ఉండేవారు.

దుబాయ్ లాంటి దేశాల్లో బజార్లో రాళ్లతో కొట్టి చంపేసి ఉండే వారు అని బీఆర్ఎస్ పై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ చేసిన పాపం వల్లనే ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేయలేకపోతున్నామని.. ఈ పాపాల బైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారని తెలిపారు. రైతులకు మేలు చేసేలా బీఆర్ఎస్ సూచనలు చేస్తే.. తాము తప్పకుండా స్వీకరిస్తామని వెల్లడించారు సీఎం. రైతుల ఆత్మహత్యలు తగ్గాయంటూ అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యల అంశంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version