రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించిన నటి సుర్విన్ చావ్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తనను ఓ డైరెక్టర్ ముద్దు పెట్టుకోబోయాడని… బలవంతం చేయబోయినట్లు వెల్లడించింది. దీంతో రానా నాయుడు నటి సుర్విన్ చావ్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

తన కెరీర్ లో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను తాజాగా బయటపెట్టింది. మీటింగ్ కోసం ఓ డైరెక్టర్ క్యాబిన్ కు వెళ్లానని ఈ సందర్భంగా వెల్లడించింది రానా నాయుడు నటి సుర్విన్ చావ్లా. అయితే తిరిగి వస్తుండగా ఆ డైరెక్టర్ తనను లాగి మరి ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడని ఫైర్ అయింది. వెంటనే నేను అతడిని నెట్టేసి గట్టిగా అరిచేసి అక్కడి నుంచి వెళ్లిపోయానని స్పష్టం చేసింది. ఓ సౌత్ డైరెక్టర్ కూడా నా కమిట్మెంట్ కోసం తన ఫ్రెండ్ తో అడిగించాడని సంచలన ఆరోపణలు చేసింది. బాడీ షేవింగ్ కూడా గురైనట్లు స్పష్టం చేసింది నటి సుర్విన్ చావ్లా.