క్రికెట్ దేవుడితో సూర్య.. అసలు విషయం ఏంటంటే..

-

తమిళ స్టార్ హీరో సూర్య ఇండియన్ మాజీ స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను కలిశారు.. ప్రస్తుతం సూర్య, సచిన్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..చాలా కాలం నుంచి సినీ తారలకు క్రికెటర్స్ కు మధ్య అనుబంధాలు కొనసాగుతూనే వస్తున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ అంతా ఇండియన్ క్రికెటర్స్ తో మంచి స్నేహబంధం కొనసాగించేది. తర్వాత సౌత్ స్టార్లు సైతం తమ అభిమాన క్రికెటర్లతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు..

ఇప్పటికే నాగార్జున, వెంకటేష్ లాంటి వారందరూ క్రికెటర్లతో అనుబంధాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ సైతం కొన్నాళ్ల క్రితం ఇండియన్ క్రికెట్ టీంకు తన ఇంట్లో విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తమిళ స్టార్ హీరోలు సైతం క్రికెటర్లతో తమ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా స్టార్ హీరో సూర్య సచిన్ టెండూల్కర్ ను కలిశారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

ఇండియన్ క్రికెట్ స్టార్ సచిన్ టెండుల్కర్ తమిళ స్టార్ హీరో సూర్య కలవటంతో ఫ్యాన్స్ కు మంచి జోష్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ ఫోటోలను సూర్య సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే కిందన రెస్పెక్ట్ అండ్ లవ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ ఫోటోలు చూసిన సినీ, క్రికెట్ అభిమానులంతా తెగ లైకులు కామెంటల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫోటోలు ఎప్పుడు దిగారు ఎక్కడ దిగారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.. మరికొందరు సూర్యకు వ్యక్తిగతంగా సచిన్ అంటే చాలా ఇష్టం.. అందుకే ఇలా కలిసి ఉంటారని కామెంట్ చేస్తున్నారు.. ఏది ఏమైనా ఇద్దరు స్టార్లను ఒకే ఫోటోలో చూడటం మాత్రం అభిమానులకు మంచి క్రేజ్ ఇస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version