టాప్ లేపిన ‘ సైరా ‘ డిజిటల్ శాటిలైట్ రైట్స్

-

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `సైరా-నరసింహారెడ్డి` అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజవుతోంది. తెలుగు – తమిళం – హిందీ – కన్నడం – మలయాళంలో భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జ‌రుగుతున్నాయి. కొణిదెల ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై చిరు త‌న‌యుడు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ రూ.250 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక సైరా బిజినెస్ అన్ని భాష‌ల్లోనూ భారీ ఎత్తున జ‌రుగుతోంది. ఇక శాటిలైట్ బిజినెస్ అయితే దుమ్ము రేపుతోంది. రు. 125 కోట్లు చెల్లించి ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ అన్ని భాష‌ల‌కు చెందిన శాటిలైట్ హ‌క్కులు సొంతం చేసుకున్న‌ట్టు నిన్న‌టి వ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి. అయితే అది నిజం కాదంటున్నారు. సైరా సౌత్ ఇండియ‌న్ లాంగ్వేజెస్ వ‌ర‌కు సన్ (జెమిని) నెట్ వర్క్ సంస్థ 25 కోట్లు చెల్లించనుందట.

ఇక హిందీ వెర్ష‌న్ శాటిలైట్ రైట్స్‌ను స‌ప‌రేట్‌గా అమ్ముతారు. ఇక డిజిటల్ రైట్స్ ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ రూ.50 కోట్లకు దక్కించుకుందని తెలుస్తోంది. ఇక ఇటీవ‌లై సైరా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యి యూ ట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. ట్రైల‌ర్ వ‌చ్చాక ముఖ్యంగా హిందీ ఆడియెన్ లోనూ సైరాకు క్రేజు పెరిగింది.

క‌ర్నూలు జిల్లాకు చెందిన ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఉయ్యాల‌వాడ‌ను తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడిగా అంద‌రూ అభివ‌ర్ణిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version