సైరా నరసింహారెడ్డి ట్విట్టర్ రివ్యూ : బొమ్మ బ్లాక్ బస్టర్

-

సైరా నరసింహారెడ్డి.. చిరంజీవి, సురేందర్ రెడ్డి దాదాపు మూడు సంవత్సరాలు వెచ్చించి రూపొందించిన చిత్రం.. స్వాతంత్ర్యపోరాట గాధ కూడా కావడంతో ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. దీనికితోడు దీన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందించడంతో చిరంజీవి కేరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా దీన్ని రూపొందించారు.

మరి ఈ మూవీ గాంధీ జయంతి రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ మూవీటాక్ ఏంటి.. ట్విట్టర్ లో ఇప్పటికే సినిమా చూస్తున్న, చూసేసిన ప్రేక్షకులు ఏమంటున్నారు.. ఓసారి చూద్దాం..

ఇప్పటివరకూ ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. అయితే ముందుగా సినిమా చూసేది ఫ్యాన్సే కాబట్టి ఎక్కువగా ఇలాంటి పోస్టులే వస్తుంటాయి. కొందరు షో ఇప్పుడే పూర్తయింది. చిరంజీవి పెర్ఫామెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్, ఎమోషనల్ సీన్స్ ఈ చిత్రంలో హైలైట్స్. ఇంకేమి ఆలోచించకుండా ఈ చిత్రాన్ని చూసేయొచ్చు. అంటున్నారు కొందరు.

సైరా అద్భుతమైన చిత్రం.. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. చిరంజీవి తన పాత్రలో అదరగొట్టారు. చిత్రంలో మిగిలిన పాత్రలు కూడా అద్భుతంగా ఉన్నాయి. సైరా హిట్టు బొమ్మ.. అంటూ తన అనుభవం పంచుకున్నాడో చిరు ఫ్యాన్.

ప్రీ ఇంటర్వెల్ 30 నిమిషాలు కుమ్మేశారు. ఫస్ట్ 40 మాత్రం సినిమా స్లోగా ఉంది. కానీ ఆ తర్వాత బాస్ మాస్ అంతే.. అంటూ మరో అభిమాని ట్వీట్ చేశారు. సైరా చిత్రం చూశాక 19వ శతాబ్దంలో నేనెందుకు పుట్టలేదా అనిపించింది. నాకు కూడా ఆ వీరులతో కలసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి అని అనిపించిందిఅంటూ తన అనుభవం పంచుకున్నారో ప్రేక్షకుడు..

సైరా ఒక రత్నం లాంటి సినిమా. డ్రామా, దేశభక్తి, ఎమోషన్ ఎలా అన్ని అంశాలని సురేందర్ రెడ్డి అద్భుతంగా మిక్స్ చేశారు. సైరా తర్వాత సురేందర్ రెడ్డి క్రేజ్ మరో స్థాయికి చేరుకుంటుంది.. అంటూ మరో ప్రేక్షకుడు ట్వీట్ చేశారు.

మొత్తం మీద ఇప్పటివరకూ అందుతున్న రెస్పాన్స్ చూస్తే.. సైరా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. చిరు పెర్ఫామెన్స్, సురేందర్ రెడ్డి డైరెక్షన్ మెప్పిస్తున్నాయి. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉందన్న టాక్ వస్తోంది. చూడాలి ఫైనల్ గా ఫలితం ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version