హాఫ్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలొద్దంటూ.. మీడియాపై తమన్నా ఫైర్

-

సెలబ్రిటీలకు మీడియాపై అప్పుడప్పుడు కోపం రావడం సహజం. కొన్నిసార్లు మీడియా కూడా పరిధులు దాటి ప్రశ్నించడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఎంతటి ప్రశాంత మూర్తులైనా కొన్నిసార్లు సంయమనం కోల్పోతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే మిల్కీబ్యూటీ తమన్నాకు ఎదురైంది. అవునండీ.. తమన్నాకు కోపం వచ్చింది. మీడియాపై అంతెత్తున లేచింది. ఎందుకో తెలుసా..?

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిల్కీ బ్యూటీ తమన్నా ఒక్కసారిగా మీడియాపై విరుచుకు పడింది. దీనికి కారణం ఆ ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్న. ఇంతకీ అతడు ఏం అడిగాడంటే..? కెరీర్‌ స్టార్టింగ్​లో పద్ధతిగానే ఉండేవారు. కానీ ఈ మధ్య మీలో బోల్డ్‌నెస్‌ ఎక్కువైంది. తగ్గిన అవకాశాలు పెంచుకోటానికేనా ఈ తిప్పలు? అని విలేకరి తమన్నాను అడిగాడు.

ఈ ప్రశ్న విన్న తమన్నాకు పిచ్చి కోపం వచ్చింది. ‘తోచింది రాసినంత తేలిగ్గాదు యాక్టింగ్‌. అయినా నాకు అవకాశాలు తగ్గాయని ఎవరు చెప్పారు మీకు?. నేను రోజుకి 18గంటలు పనిచేస్తున్నా. ఇంత బిజీగా ఇంతకు ముందు కూడా లేను. నా పరిధి నాకు తెలుసు. ప్రవర్తన, వేషధారణ అనేవి పాత్ర డిమాండ్‌ని బట్టి ఉంటాయి. కేరక్టర్‌ నచ్చితేనే చేస్తాను. ఒప్పుకున్న తర్వాత పూర్తి న్యాయం చేయడం నటిగా నా ధర్మం. హాఫ్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలడగొద్దు ప్లీజ్‌..’ అంటూ సీరియస్‌గా సమాధానచ్చింది తమన్నా. ప్రస్తుతం తమన్నా రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news