ఆ హీరోకి ఒక్కడికే లిప్ లాక్ ఇస్తా..!

-

మిల్కీ బ్యూటీ తమన్నా దశాబ్ధ కాలంగా సిని కెరియర్ సాగిస్తుంది. మూడేళ్ల క్రితం కెరియర్ కాస్త అటు ఇటుగా ఉన్నట్టు అనిపించినా బాహుబలిలో అవంతికగా తన మెరుపులతో ఆకట్టుకుంది. ఈమధ్య ఎఫ్-2తో సూపర్ హిట్ అందుకున్న తమన్నా ప్రస్తుతం రెండు మూడు సినిమా అవకాశాలను అందుకుందని తెలుస్తుంది. స్పెషల్ సాంగ్స్ కేవలం డబ్బు కోసమే చేస్తుందన్న వాదనలకు సమాధానంగా సినిమా హీరోయిన్ అయినా, స్పెషల్ సాంగ్ అయినా సంతృప్తిగానే చేస్తా డబ్బు కోసం కాదని చెప్పింది.

ఇక స్టార్ హీరోయిన్ గా ఇన్ని సినిమాలు చేసినా తమన్నా మూతి ముద్దులు మాత్రం ఇచ్చింది లేదు. ఆ రకమైన ఇమేజ్ తనకు వద్దని అనుకుంది. అయితే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కు మాత్రం లిప్ లాక్ ఇచ్చేందుకు రెడీ అంటుంది తమన్నా. అతనొక్కడికే ఆ ఛాన్స్ ఇస్తా అని అంటుంది. హృతిక్ అంటే తమన్నాకి అంత ఇష్టమని తెలుస్తుంది. ఇక ఈమధ్య బాహుబలి చేయకుంటే తన కెరియర్ ఎలా ఉండేదో అంటూ రాజమౌళిని పొగుడుతూ చేసిన కామెంట్స్ ఆర్.ఆర్.ఆర్ లో ఛాన్స్ కోసమే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version