పరిటాల సునీతకు షాక్.. టీడీపీకి గుడ్‌బై చెప్పిన అనంతపురం నేత!

-

ఏపీలో అధికార టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. టీడీపీలో అసమ్మతి సెగలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీలో పెరిగిపోతున్న కుల రాజకీయాలు, అవినీతి, అక్రమాలను తట్టుకోలేక పార్టీ నుంచి ముఖ్య నేతలంతా వెళ్లిపోతున్నారు.

తాజాగా అనంతపురంలో మంత్రి పరిటాల సునీతకు ఎదురు దెబ్బ తగిలింది. సునీత నియోజకవర్గం రాప్తాడుకు చెందిన టీడీపీ ముఖ్య నాయకుడు నలపరెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి సునీత.. వాళ్ల సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని.. రాప్తాడులో పరిటాల సునీత అరాచకాలు ఎక్కువయ్యాయని.. అందుకే టీడీపీని వీడుతున్నట్టు ఆయన తెలిపారు. అయితే.. ఆయన మళ్లీ ఏ పార్టీలో చేరేది మాత్రం వెల్లడించలేదు. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఆయన వైఎస్సాఆర్సీపీలో చేరుతారని చెబుతున్నారు.

టీడీపీకి గుడ్‌బై చెప్పిన బాలకొండయ్య

వైఎస్సాఆర్ కడప జిల్లాలోనూ టీడీపీ పార్టీలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. జిల్లా టీడీపీ నాయకత్వం తీరు నచ్చక చాలామంది టీడీపీని వీడుతున్నారు. తాజాగా కడప కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ బాలకొండయ్య ఇవాళ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో నీతినియమాలు లేవని.. విలువలు లేని పార్టీలో తాను ఉండలేనంటూ బాలకొండయ్య పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version