పెళ్లిపై అలాంటి కామెంట్స్ చేసి షాక్ ఇచ్చిన తమన్నా..!

-

మిల్క్ బ్యూటీ తమన్నా గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. సీనియర్ నటిగా భారీ పాపులర్ దక్కించుకున్న ఈమె ఇటీవల బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం ఒక పత్రిక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్న పెళ్లి విషయంపై తనదైన స్టైల్ లో వ్యంగంగా స్పందించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది..

ఆమె మాట్లాడుతూ..” మేమిద్దరం కలిసి ఒక సినిమా చేసాము.. అంతమాత్రానికే మా మధ్య ఏదో ఉందని పుకార్లు బాగా సృష్టించారు.. ఇలాంటి అనవసర విషయాల గురించి నేను అసలు పట్టించుకోను.. అయితే దానిపై ఇంకా స్పష్టతనివ్వాల్సిన అవసరమూ లేదు.. హీరోయిన్ల విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు.. కథానాయకుల విషయంలో ముఖ్యంగా ఇలాంటి ఊహాగానలు రావడం చాలా దురదృష్టకరం అంటూ ఆమె చెప్పుకు వచ్చింది..

అంతేకాదు నిజంగానే మాకు నిజమైన పెళ్లి కావడానికి ముందే ఎన్నోసార్లు పెళ్లి చేసేస్తుంటారు.. వైద్యుల నుంచి వ్యాపారవేత్తలు దాకా అందరితోనూ మాకు వివాహం జరిపిస్తుంటారు. అవన్నీ చదువుతుంటే ఒక్కోసారి నాకు కూడా పెళ్లయిపోయిందేమో అని అనుమానం కలుగుతుంది. ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకున్నా కూడా అది పుకారే అని జనం నమ్మరేమో అంటూ ఆమె వాపోయారు. మొత్తానికైతే తనపై వస్తున్న డేటింగ్ రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది తమన్న. మరి ఇకనైనా ఆమె గురించి ఇలాంటి వ్యాఖ్యలు రాయడం మీడియా మానేస్తారో లేదో చూడాలి. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా అవకాశాన్ని సొంతం చేసుకుంది. మరొకవైపు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version