న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట పై ఉన్నత స్థాయి కమిటీ వేసింది రైల్వే శాఖ. అయితే తొక్కిసలాట, రద్దీ వీడియోలను భద్రపరచాలని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అధికారులకు ఆదేశించింది కమిటీ. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దుర్ఘటనలో 18 మంది మృతి చెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు క్షతగాత్రులు. కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక రైళ్ళు నడుపుతుంది రైల్వే శాఖ.
అయితే ప్రజలకు ప్రయాణికులకు సపోర్ట్ చేయడమే మా విధి అని రైల్వే డిసిపి అన్నారు. అదే విధంగా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. ఇక ఈ ఘటనలో మృతి చెందిన వాళ్లకు నష్టపరిహారం ప్రకటించింది కేంద్రం. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ప్రకటించగా.. తీవ్రంగా గాయపడ్డాడు వాళ్లకు రెండున్నర లక్షలు.. స్వల్ప గాయాలైన వాళ్లకు లక్ష రూపాయలు ప్రకటించింది కేంద్రం.