బ్లాక్ బ్యూటీగా మారిపోయిన మిల్కీ బ్యూటీ..అసలు విషయం ఇదే!!

-

టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా భాటియా..మిల్కీ బ్యూటీగా ఫుల్ ఫేమస్ అయింది. ఆమెను ముట్టుకుంటే చాలు..మరక అవుతుందనేంత అందం ఆమె సొంతం. కాగా, తాజాగా ఈ భామ బ్లాక్ బ్యూటీ అయిపోయింది. వివరాల్లోకెళితే..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మిల్కీ బ్యూటీ..తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు చూస్తే ఆమె నల్లబడిపోయిందని మీకు అర్థమవుతుంది.

‘మిస్ బి ఫీలింగ్ ఆల్ బ్లాక్ అండ్ బ్లర్రి’ అనే క్యాప్షన్ తో నలుపు రంగు లాంగ్ ఫ్రాక్ లో ఎక్స్ పోజింగ్ చేస్తూ, కత్తి లాంటి చూపులతో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రకారు మతి పోగొట్టుకుంటున్నారు. ఈ ఫొటోలు చూసి మిల్కీ బీటీ హాట్ బ్యూటీగా మారిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

తమన్నా భాటియా నటించిన F3 ఈ నెల 27న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో ప్రజెంట్ ఆమె పాల్గొంటోంది. ‘బబ్లీ బౌన్సర్’ అనే బాలీవుడ్ మూవీలో కూడా నటిస్తు్న్న తమన్నా..F3లో చాలా చక్కటి పాత్ర పోషించిందని మేకర్స్ చెప్తున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో తమన్నా నవ్వులు పూయిస్తుందని మేకర్స్ పేర్కొంటున్నారు. ఈ ఫిల్మ్ లో తమన్నా భాటియా..విక్టరీ వెంకటేశ్ కు జోడీగా నటించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version