Tamil director Suresh Sangaiah passes away in Chennai: తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది… యువ దర్శకుడు కన్నుమూశాడు. చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు.
ఇక తాజాగా తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడిన యువ దర్శకుడు సురేశ్ సంగయ్య శుక్రవారం రాత్రి 11 గంటలకు కన్నుమూశారు. కాగా, సురేశ్ 2017లో ‘ఒరు కిడైయిన్ కరు మను’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. గతేడాది ‘సత్య సొతనై’ మూవీతో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందారు. సురేశ్ మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.