పవన్ సినిమాలో తమిళ హీరో…!

-

రాజకీయాలకు విరామం ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇపుడు మూడు సినిమాలను ఆయన లైన్ లో పెట్టారు. వచ్చే ఏడాది ఈ మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం ఆయన వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను వేసవి తర్వాత విడుదల చెయ్యాలని చూసారు.

కాని అనూహ్యంగా కరోనా ప్రభావం తో షూటింగ్ ని ఆపేశారు. ఈ సినిమా తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ని విరూపాక్ష అని అనుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొంత షూటింగ్ ని కూడా పూర్తి చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో పవన్ తో పాటుగా మరో హీరో కూడా నటిస్తున్నారు. ఆయనే శివ కార్తికేయన్…

ఆయన ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పవన్ కి ఆయన ప్రత్యర్ధిగా నటించే అవకాశం ఉందని అయితే రెండో భాగంలో ఆయన కనపడే అవకాశం ఉందని అంటున్నారు. ఆ పాత్ర సినిమా కథలో కీలక మలుపు అని, ఆ పాత్రకు ముందు విజయ్ సేతుపతిని అడిగినా ఆయన బిజీ గా ఉండటంతో శివ కార్తికేయన్ ని అడిగారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క నటించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news