దీపావ‌ళికి ఫోర్ స్టార్ వార్‌..!

ఈ ఏడాది దీపావ‌ళి కోలీవుడ్‌లో న‌లుగురు స్టార్ హీరోల మ‌ధ్య ర‌ణ‌రంగంమే జ‌ర‌గ‌నుంది. అయితే ప్రేక్ష‌కుల‌కు మాత్రం దీపావ‌ళి ట‌పాసుల‌తో పాటు ఈ నాలుగు సినిమాల‌తో ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఫెస్టివల్‌గా మార‌నుంది. ఎందుకంటే నాలుగు పెద్ద సినిమాలు తెరపైకి వస్తున్నాయి. విజయ్ బిగిల్, ధనుష్ పట్టాస్, కార్తీ యొక్క ఖైదీ మ‌రియు విశాల్ నటించిన యాక్షన్ చిత్రాలు ఈ దీపావ‌ళికి రిలీజ్‌కు సిద్ధం అయ్యాయి.


అయితే ముందుగా విజయ్ బిగిల్ చిత్రం విడుద‌ల డేట్‌ను ప్ర‌క‌టించారు. ఇది అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన స్పోర్ట్స్-డ్రామా. తలాపతి  డ‌బుల్ రోల్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఆర్‌ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన పట్టాస్‌లో ధనుష్ కూడా డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు. స్నేహ, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఎమోషనల్ కంటెంట్‌పై ఎక్కువగా ఉంటుంది.

లోకేష్ క‌న‌క‌రాజ్‌తో ద‌ర్శ‌క‌త్వంలో కార్తీ న‌టించిన ఖైదీ సినిమా క‌థ అంతా రాత్రిలోనే జ‌రుగుతుండ‌టం విశేషం. టీజ‌ర్ కూడా మొత్తం నైట్ విజువ‌ల్స్‌తోనే నిండిపోయింది. ఇక విశాల్ న‌టించిన యాక్ష‌న్ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. సి సుందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక యాక్షన్-రొమాంటిక్ చిత్రంగా ఉండ‌బోతుంది. ఈ నాలుగు సినిమాలు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో సంతృప్తి ప‌రిచేలా ఉన్నాయి. అయితే ఈ ఫోర్ స్టార్‌ వార్‌ బాక్సాఫీస్ వద్ద ఎవ‌రి కలెక్షన్స్ మీద ఎవ‌రు ప్రభావం చూపుతారో చూడాలి.