వియత్నాంకు చెందిన వియట్‌జెట్ ఎయిర్‌లైన్స్‌నే బికినీ ఎయిర్‌లైన్స్ అని పిలుస్తారు. అయితే ఈ సంస్థ ఇకపై భారత్‌లోనూ తమ సేవలను ప్రారంభించనుంది.
వియత్నాంకు చెందిన బికినీ ఎయిర్‌లైన్స్ సంస్థ తెలుసు కదా.. 2011లో ఈ సంస్థ ఒక్కసారిగా పాపులర్ అయింది. తమ విమానాల్లో బికినీలు ధరించిన ఎయిర్ హోస్టెస్‌లు సేవలు అందిస్తారనే ప్రచారంతో ఒక్కసారిగా ఈ ఎయిర్‌లైన్స్ వెలుగులోకి వచ్చింది. వియత్నాంకు చెందిన వియట్‌జెట్ ఎయిర్‌లైన్స్‌నే బికినీ ఎయిర్‌లైన్స్ అని పిలుస్తారు. అయితే ఈ సంస్థ ఇకపై భారత్‌లోనూ తమ సేవలను ప్రారంభించనుంది. అవును.. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే..!
బికినీ ఎయిర్‌లైన్స్ ఇకపై భారత్‌లోనూ సేవలు ప్రారంభించనుంది. డిసెంబర్ 6వ తేదీ నుంచి భారత్‌లో ఈ విమానయాన సంస్థ సేవలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ, హనొయ్, హొ చి మిన్ సిటీల నడుమ ఈ ఎయిర్‌లైన్ సర్వీసులు నడుస్తాయి. డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీ నుంచి హొ చి మిన్ సిటీకి బికినీ ఎయిర్‌లైన్స్ సేవలు ప్రారంభమవుతాయి. ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారం రోజున ఈ మార్గంలో ఆ కంపెనీ విమానాలు నడుస్తాయి. అలాగే రిటర్న్‌లోనూ ఈ విమానంలో మరుసటి రోజు రావచ్చు.
ఢిల్లీ నుంచి రాత్రి 11.50 గంటలకు విమానం బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు హొ చి మిన్ సిటీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో హొ చి మిన్ సిటీ నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరి ఢిల్లీకి అదే రోజు రాత్రి 10.50 గంటలకు చేరుకుంటుంది. డిసెంబర్ 7వ తేదీ నుంచి హనొయ్ నుంచి ఢిల్లీకి 3 రిటర్న్ ఫ్లయిట్‌లను నడపనున్నారు. ఇవి మంగళ, గురు, శనివారాల్లో నడుస్తాయి. ఢిల్లీలో రాత్రి 11.50 గంటలకు విమానం బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.20 గంటలకు హనొయ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 7.10 గంటలకు హనొయ్ నుంచి బయల్దేరి అదే రోజు రాత్రి 10.50 గంటలకు ఢిల్లీకి విమానం చేరుకుంటుంది. కాగా ప్రస్తుతం మొదటి మూడు రోజుల కోసం మాత్రం ఢిల్లీ నుంచి వియత్నాంకు బికినీ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసు టిక్కెట్లను అమ్మకానికి ఉంచింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ రోజుకు 400 విమానాలు నడుపుతూ 129 మార్గాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. అయితే బికినీ ఎయిర్‌లైన్స్ భారత్‌లో సేవలను ప్రారంభించడంపై అన్ని వర్గాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి..!