నందమూరి తారకరత్న మరణంతో టాలీవుడ్లో విషాదం నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తారక్ మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తారకరత్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇది ఇలా ఉండగా, కొన్ని రోజుల వరకూ తనతో సందడిగా గడిపిన తన తండ్రి… చలనం లేకుండా ఉండిపోవడాన్ని చూసి..తారక్ కూతురు గుండెలు పగిలెలా ఏడ్చేసింది. చిన్న వయస్సులోనే కుటుంబ పెద్దగా ఉన్న తండ్రిని కోల్పోవడంతో.. చిన్నారిని చూసి.. అక్కడున్న వారంతా కంటతండి పెట్టుకున్నారు.