నందమూరి వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు తారకరత్న. తన ఫస్ట్ సినిమా ఒకటో నెంబర్ కుర్రాడుతోని బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు ఆ తర్వాత ఒకేసారి 9 సినిమాలను చేశారు వీటిలో ఐదు మాత్రమే విడుదలయ్యాయి ఏకాతరవాత తారకరత్నకు సరైన సక్సెస్ లేకపోవడంతో టాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయారు. కానీ ప్రయత్నం మాత్రం ఆపలేదు తారకరత్న ఎదగడానికి చాలా కష్టపడ్డారు అయితే స్టార్ హీరోగా ఎదగలేకపోయారు కానీ అభిమానులలో నటనతో ప్రేక్షకులను బాగా సంపాదించారు.
హీరోగా సక్సెస్ కాలేకపోవడంతో విలన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. కొంతకాలం రాజకీయాలలో చురుకుగా వ్యవహరిస్తున్న తారకరత్న టిడిపిలో తారకరత్న చాలా చురుకుగా పాల్గొనేవారు ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రలో పాల్గొన్నారు మొదటి రోజు తారకరత్నకు ఒకసారిగా గుండెపోటు రావడంతో కింద పడిపోయారు దీంతో అక్కడ ఉన్న కార్యకర్తలు అలర్ట్ అయ్యి వెంటనే దగ్గరలో ఒక హాస్పిటల్లో చేర్పించారు. గుండెపోటుకు గురైనట్లుగా వైద్యులు నిర్ధారించడంతో సిపిఆర్ చేశారు దీంతో తారకరత్న గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది.
అయితే అత్యాధునిక వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు. కొద్దిరోజులు చికిత్స అందించారు.. కానీ ఆరోగ్యం విషమించడంతో నిన్నటి రోజున రాత్రి మరణించారు. 2024 ఎన్నికలలో తారకరత్న ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారట. దీని కోసం గ్రౌండ్ లెవెల్ లో ప్రిపేర్ అవుతున్నట్లుగా సమాచారం. ఈసారి కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్నారట తారకరత్న.ఈ విషయాన్ని చంద్రబాబు, లోకేష్ కు కూడా తెలియజేశారట. అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా సమాచారం. ఒకవేళ తారకరత్న బతికి ఉంటే వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు ఇలా తన కోరిక నెరవేరుకుండానే మరణించారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.