సినిమా పాటల్లో అసభ్యకరమైన డాన్స్ లపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్

-

సినిమా పాటల్లో అసభ్యకరమైన డాన్స్ లపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు. మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్ ను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. లేకపోతే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ వార్నింగ్ ఇచ్చారు.

Telangana Women’s Commission serious about indecent dances in movie songs

సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించడం, మహిళల గౌరవాన్ని కాపాడటం అనేది నైతిక బాధ్యత. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయవచ్చు. ఈ విషయం పై నిశితంగా పరిశీలన కొనసాగిస్తూ, అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చింది తెలంగాణ మహిళా కమిషన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version