బాలీవుడ్ నటితో రహస్య డేటింగ్ లో తెలుగు హీరో..!

-

ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎలా ప్రేమలో పడతారో చెప్పడం అసాధ్యంగా మారిపోయింది. ఈ క్రమంలోనే కొంతమంది తమకు నచ్చిన వారిని జీవిత భాగస్వామిగా చేసుకుంటే.. మరి కొంతమంది ఆల్రెడీ పెళ్లయి.. పిల్లలు ఉన్నవారితో సహజీవనం చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అచ్చ తెలుగు రాజమండ్రి కుర్రాడు హర్షవర్ధన్ రానే కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడని చెప్పాలి. బాలీవుడ్ హీరోలను మించి హ్యాండ్సమ్ లుక్కుతో అందరినీ ఆకట్టుకునే ఈయనను మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతగా గుర్తించలేకపోయింది.

దీంతో బాలీవుడ్ కి మకాం మార్చి అక్కడ పలు చిత్రాలలో నటించి బాగా పాపులారిటీ దక్కించుకున్నారు. అంతేకాదు ప్లే బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ అక్కడ కిమ్ శర్మ , మీనాక్షిలతో పాటు మరికొంతమందితో డేటింగ్ చేసినట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా మరొక బాలీవుడ్ నటితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించడం గమనార్హం. అసలు విషయంలోకి వెళితే ప్రముఖ నటుడు అమీర్ అలీని వివాహం చేసుకొని 2021 లో ఒక పాప జన్మించిన తర్వాత అమీర్ అలీతో విడాకులు తీసుకుంది సంజీదా షేక్.. ఇక ఇప్పుడు హర్ష తో డేటింగ్ చేస్తోంది అంటూ వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే హర్షవర్ధన్ షేర్ చేసిన ఫోటోలు, సంజీదా షేర్ చేసిన ఫోటోల బ్యాక్ గ్రౌండ్ రెండూ మ్యాచ్ అవ్వడంతో నెటిజన్స్ ఫోటోలను ట్రెండ్ చేస్తూ వార్తలు సృష్టిస్తున్నారు.

ఇక దీనిపై హర్షవర్ధన్ ను విలేకరులు ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి వార్తలు నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టవు.. ఇక జర్నలిస్టులకు వీక్లీ టార్గెట్లు ఉంటాయి కాబట్టి వారు ఇలాంటి కథనాలు రాయడం సహజం.. కాబట్టి నేను అసలు వీటిని పట్టించుకోను అంటూ ఆయన వెల్లడించారు. మొత్తానికైతే వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారని పరోక్షంగా హింట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version