రోజాకు సన్నీ లియోన్ స్ట్రాంగ్‌ కౌంటర్‌..నీకు నాకు తేడా ఉంది !

-

 

ఏపీ మంత్రి రోజాకు సన్నీ లియోన్ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. నీకు నాకు తేడా ఉందంటూ పోస్ట్‌ పెట్టారు సన్నీ లియోన్. నిన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు మంత్రి రోజా కౌంటర్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సంస్కారం గురించి పవన్ మాట్లాడటం.. సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్లుందంటూ రోజా వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ సంస్కారం గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందంటూ రోజా చెబుతూ.. పవన్ మాట్లాడుతుంటే సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్లు ఉందని పోల్చి చెప్పింది. ఒకరి మాటకు విలువ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడు కాబట్టే తనను భార్యలు వదిలేశారు అంటూ రోజా ఫైర్‌ అయింది.

అయితే.. పవన్‌ కళ్యాణ్‌ విమర్శించేటప్పుడు తనను మధ్యలో ఎందుకు లాగావ్‌ అంటూ ఫైర్‌ అయింది సన్నీ లియోన్‌. నేను పోర్న్‌స్టార్‌ నే… నా గతం గురించి అస్సలు నేను బాధపడటం లేదు. మీలా కాకుండా నేను చేయాలనుకున్నది బహిరంగంగానే చేశానని తెలిపింది. నీకు నాకు తేడా ఒక్కటే, నేను ఇండస్ట్రీని వదిలేశాను, నువ్వు కాదు అంటూ చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version