తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్…ఎల్లుండి విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి. తిరుమలలో ఎల్లుండి శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరుగనుంది. సాయంత్రం పుష్పపల్లకిలో భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి. ఈ తరుణంలోనే.. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టిటిడి పాలక మండలి.
రేపు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది టిటిడి. కాగా, తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,472 మంది భక్తులు కాగా, తలనీలాలు సమర్పించిన 31,980 మంది భక్తులు ఉన్నారు. ఇక నిన్న హుండీ ఆదాయం రూ.3.77 కోట్లుగా నమోదు అయింది.