రాజకీయాల్లోకి దళపతి విజయ్ ఎంట్రీ.. త్వరలోనే పాదయాత్ర!

-

సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చిన సందర్భాలు చాలా ఎక్కువే. ఇప్పటికే చిత్రపరిశ్రమ నుంచి వచ్చి రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన వారెందరో. ఇప్పుడు ఆ జాబితాలో తమిళ నటుడు.. దళపతి విజయ్ చేరబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్​ కూడా రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈమధ్య కాలంలో ఆయన చేసే కార్యక్రమాలు కూడా వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇటీవలె తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా టెన్త్‌, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాలతో పాటు అభిమానులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఖాయమనే అనిపిస్తోందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

తాజాగా మంగళవారం ‘విజయ్‌ మక్కళ్ ఇయక్కం’ సభ్యులతో విజయ్ ఓ సమావేశం ఏర్పాటు చేశారు. 2026లో జరిగే ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవ్వాలన్న అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న విజయ్​.. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. మరోవైపు కొన్ని రోజుల్లో పాదయాత్ర కూడా చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version