నా జీవితానికి బాలయ్యే శివుడు.. అఖండ విశేషాలు పంచుకున్న తమన్..!

-

టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా చలామణి అవుతున్న ఎస్ఎస్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. దేవిశ్రీప్రసాద్ మెగాస్టార్ సినిమాల కోసం ఎంత ప్రత్యేకంగా పనిచేస్తారో ..ఎస్ఎస్ తమన్ కూడా బాలకృష్ణ సినిమాలకు అంతే ప్రత్యేకంగా పనిచేస్తారు. మిగతా హీరోలతో పోల్చుకుంటే బాలయ్య సినిమాలకు తమన్ అందించే సంగీతం, బిజిఎం రెండూ కూడా వేరే లెవెల్ అని చెప్పడంలో సందేహం లేదు ఇకపోతే తాజాగా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాకి కూడా తమ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు.

ముఖ్యంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడానికి కారణం.. తమన్ అందించిన మ్యూజిక్ కూడా ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరసింహారెడ్డి మాసివ్ హిట్ దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆదివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మరొకసారి బాలయ్య మీద ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నాడు. సక్సెస్ మీట్ లో భాగంగా తమన్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో గోవిందా గోవిందా జపం తర్వాత మనం ఎక్కువగా వినేది జై బాలయ్య అంటూ ప్రశంసలు కురిపించారు. అఖండ సినిమా సమయం నుంచి బాలయ్యను శివుడిలా చూస్తున్నాను అని తెలిపాడు.

నా జీవితానికి ఆయనే శివుడు. అంతే నేను అఖండ నేపథ్య సంగీతం చేస్తున్న సమయంలో స్క్రీన్ మీద నిజంగా శివుడిని చూస్తున్నాను. శివుడికి పూజ చేసేటప్పుడు ఎంత దీక్షగా ఉంటామో ఈ సినిమాకు మ్యూజిక్ అందించేటప్పుడు కూడా అలానే చేశాను. సాధారణంగా నేను నాన్ వెజ్ తినను. కానీ ఆమ్లెట్ తింటాను. అయితే అఖండ సినిమాకు సంగీతం సమకూర్చేటప్పుడు ఆమ్లెట్ కూడా తినకుండా పనిచేశాను. రోజు లింగ పూజ చేస్తూ చాలా కష్టపడ్డాను అంటూ బాలయ్య పై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్లకు ఆర్ఆర్ చేసేటప్పుడు స్టిక్కులతో కాకుండా చేతుల్లో రెండు కత్తులు పెట్టుకుని వాయించాను అని.. బాలకృష్ణ తమ గుండెల్లో ఎప్పటికీ ఉంటారు అని.. ఆయన సినిమాకు నిజాయితీగా పని చేస్తాను అని కూడా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version