ఎన్టీఆర్, శ్రీదేవిల గురించి ఆ దర్శకుడి జోస్యం అక్షరాల సత్యం..ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే?

-

విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ, నటరత్న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తెలుగు వారికి ఎంత ఇష్టమైన కథా ‘నాయకుడో’ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా రంగంలో విశేషమైన పేరు ప్రఖ్యాతులు గాంచిన ఎన్టీఆర్..తనను అంతటి వాడిని చేసిన ప్రజల కోసం ప్రజాక్షేత్రంలోకి అనగా రాజకీయ రంగంలోకి వచ్చి ప్రజలకు ఎనలేని సేవలు చేశాడు. ఇక సినిమాల్లో ఎన్టీఆర్-శ్రీదేవిల జోడీ గురించి అందరికీ తెలుసు.

హిట్ పెయిర్ గా శ్రీదేవి-ఎన్టీఆర్..ఎన్నో సూపర్ హిట్ పిక్చర్స్ చేశారు. ‘సర్దార్ పాపారాయుడు’, ‘బొబ్బిలి పులి’, ‘వేటగాడు’, ‘కొండ వీటి సింహం’ చిత్రాల్లో వీరు కలిసి నటించారు. అతి చిన్న వయసులోనే స్టార్ డమ్ పొందిన హీరోయిన్ గా శ్రీదేవి ఎదిగింది. కాగా, శ్రీదేవి, ఎన్టీఆర్ ల సినీ కెరీర్ గురించి దర్శకుడు విఠలాచార్య అప్పట్లోనే ఆసక్తికర జోస్యం చెప్పాడట.

ఎన్టీఆర్ జాతకం చూసిన విఠలాచార్య ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతాడని చెప్పాడట. శ్రీదేవి గురించి కూడా టాప్ హీరోయిన్ గా అతి తక్కువ కాలంలోనే ఎదుగుతారని పేర్కొన్నారట. అయితే, అలా విఠలా చార్య చెప్పినట్లుగానే వీరిరువురు తమ కెరీర్ లో సక్సెస్ అయ్యారు.

ఎన్టీఆర్ ను అయితే ప్రజలు చిత్ర కథానాయకుడిగానే కాక దేవుడిగా కొలిచారు. ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రిగానూ ప్రజలకు ఆయన సేవలందించారు. శ్రీదేవి బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version