ఆ హీరోకి అమ్మాయిల పిచ్చి ఎక్కువే – జబర్దస్త్ అప్పారావు..!

-

బుల్లితెరపై గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ అలరిస్తున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇందులో తన నటనతో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్న కమెడియన్ అప్పారావు ఒకప్పుడు జబర్దస్త్ లో చేసి ఇప్పుడు సినిమాలకే తన కెరీర్ ను పరిమితం చేశారు. ఇకపోతే త్వరలోనే రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తిరగబడరా స్వామి అనే సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు అప్పారావు. ఈ క్రమంలోనే తాజాగా మీడియా సమావేశంలో పాల్గొని హీరో రాజ్ తరుణ్ పై ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మాణ సారధ్యంలో ఏఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తూ రాజ్ తరుణ్ హీరోగా మాళవిక మల్హోత్ర హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం తిరగబడరా స్వామి.. ఇందులో అప్పారావు మటన్ మస్తాన్ అనే పాత్రలో నటిస్తున్నారట. ఇక ఈ సినిమాలో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని ఇప్పటివరకు ఇలాంటి పాత్రలలో తాను నటించలేదని తెలిపారు.అంతేకాదు ఈ సినిమా అన్ని వర్గాల వారిని మెప్పిస్తుంది అంటూ కూడా తెలిపారు అప్పారావు.

ఇక మరొకవైపు ఈ సినిమాలో రాజ్ తరుణ్ పాత్ర గురించి చెబుతూ.. రాజ్ తరుణ్ అమ్మాయిలు కనిపిస్తే చాలు వెంటబడే పాత్రలో నటించబోతున్నారు అంటూ అప్పారావు కామెంట్లు చేయగా ప్రస్తుతం ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో రాజ్ తరుణ్ చాలా తక్కువ సినిమాలలో నటిస్తున్నారని చెప్పాలి.అయితే ఏవి కూడా ఆయన కెరీర్ కు పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోతున్నాయి. మరి ఈ సినిమా అయినా ఆయనకు సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news