తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాగా వచ్చి భారీ లాభాలతో సూపర్ హిట్ అందుకున్న బేబీ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ సినిమాలో విరాజ్ అశ్విన్, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య పోటీపడి మరీ తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో తనకు అది లేకపోవడం వల్లే ఛాన్స్ మిస్ అయిందని నటుడు అర్జున్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అసలు విషయంలోకెళితే పలు సీరియల్స్, బిగ్ బాస్ సీజన్ సిక్స్ ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న అర్జున్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
శ్రీ సత్య ను పిచ్చిగా ప్రేమించినట్టు కనిపించడంతో త్వరగానే ఆయనను ఎలిమినేట్ చేశారు.ప్రస్తుతం సినిమా అవకాశాలు దక్కించుకున్నా..బేబీ సినిమాలో తనకు చాన్స్ ఎలా మిస్ అయ్యిందో వెల్లడించారు.
అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇటీవల ఒక కల్ట్ క్లాసిక్ గా విడుదలైన సినిమా విజయం సాధించింది. ఈ ప్రాజెక్టులో సెకండ్ హీరోగా నేను నటించాల్సి ఉంది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ నా ఫ్రెండ్ కావడంతో నా పేరు రిఫర్ చేసింది. దర్శకుడు కూడా ఫ్రెండే.. దీంతో నాకు అవకాశం వస్తుందని అనుకున్నాను. అయితే ఇది నాలుగు కోట్ల ప్రాజెక్టు కాబట్టి కొంచెం మార్కెట్ ఉన్న హీరో కావాలి అని చెప్పి వేరే హీరోని అనుకుంటున్నామని అన్నారు.
ఆ మాట విని నిరాశకు గురయ్యాను. ఎక్కడైనా సరే మార్కెట్ లేకుండా గుర్తింపు రాదు. ఆ గుర్తింపు కోసమే బిగ్ బాస్ కి వెళ్ళాను కానీ అవకాశాలు ఇవ్వకుండా మార్కెట్ ఎలా క్రియేట్ అవుతుంది అంటూ ఆయన ప్రశ్నించాడు. సినిమాలలో నటిస్తేనే కదా జనాలలో గుర్తింపు వస్తుంది . అది రాకుండా మార్కెట్ ఎలా క్రియేట్ అవుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తానికైతే తనకు మార్కెట్ లేకపోవడం వల్లే బేబీ సినిమాలో అవకాశం కోల్పోయానని తెలిపాడు అర్జున్ కళ్యాణ్.