నరేశ్ మూడు పెళ్లిళ్లపై హైపర్ ఆది కామెంట్స్.. పవిత్ర రియాక్షన్ ఇదే..!

-

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్​పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేశ్ 3 పెళ్లిళ్లపై ఆది చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్​గా మారాయి. అయితే ఆది.. నరేశ్, పవిత్రల ముందే ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. ఇంతకీ ఆది చేసిన కామెంట్స్ ఏంటి.. దానికి పవిత్ర, నరేశ్​ల రియాక్షన్ ఏంటో తెలుసుకుందామా..?

వినాయక చివితి సందర్భంగా ఓ ఛానెల్​లో ‘సామీ రారా’ అనే స్పెషల్ ఈవెంట్​ చేస్తున్నారు. ఈ ఈవెంట్​లో పవిత్ర, నరేశ్ సందడి చేశారు. ఈ స్పెషల్ ప్రోగ్రామ్​కు సంబంధించిన ప్రోమో​ రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో హైపర్ ఆది.. ‘నాకు ఒక్క పెళ్లే అవ్వట్లేదు.. మీకు పెళ్లి, మళ్లీ పెళ్లి? ఎలా సార్’ అంటూ నరేశ్​ను సరదాగా ప్రశ్నించారు. ఈ కామెంట్స్​కు నరేశ్, పవిత్రా నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇంతకీ ఏం సమాధానం ఇచ్చారనేది ప్రోమోలో రివీల్​ చేయలేదు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అయింది. మరి మీరూ ఓ లుక్కేయండి.

Read more RELATED
Recommended to you

Latest news