‘ది డీపెస్ట్‌ బ్రీత్‌’ ట్రైలర్‌ రిలీజ్.. నెట్​ఫ్లిక్స్​పై నెటిజన్లు ఫైర్

-

తాజాగా ‘ది డీపెస్ట్‌ బ్రీత్‌’ డాక్యుమెంటరీ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది. సముద్రంలో ఫ్రీడైవింగ్‌ చేసే నేపథ్యంలో తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ట్రైలర్​ను విడుదల చేయడంపై నెట్​ఫ్లిక్స్ ప్రస్తుతం తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటోంది. ఇంతగా విమర్శలు ఎదుర్కోవడానికి గల కారణం.. టైటాన్‌ మినీ సబ్​మెరైన్​ ఆచూకీ సముద్రంలో గల్లంతై పేలిపోవడమే. అట్లాంటిక్‌ మహా సముద్రంలో 111ఏళ్ల కిందట మునిగిన టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు టైటాన్‌ మినీ సబ్​మెరైన్​సో వెళ్లిన ఓ ఐదుగురి బృందం సబ్​మెరైన్ పేలి చనిపోయారు.

ఈ ఘటన జరిగిన సమయంలోనే.. ఫ్రీడైవింగ్‌ నేపథ్యంగా తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌ను విడుదల చేసినందుకుగానూ నెట్‌ఫ్లిక్స్‌ విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. ఫ్రీడైవింగ్‌లో వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకున్న అలేసియా జెచీని జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సముద్రంలో ప్రాణంతో చెలగాటం ఆడినట్టు చూపించిన ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌ను విడుదల చేయడానికి ఇది సరైన సమయం కాదంటూ అభిమానులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version