తరుణ్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా..?

-

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లకు లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుందని అందరూ చెబుతుంటారు. ఇక కొంతమంది హీరోయిన్లకు కెరియర్ కాస్త ఇంకా తక్కువ ఉంటుందని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే ఒక్కసారిగా హిట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత వరుస విజయాలను సొంతం చేసుకున్న హీరోయిన్లు అలాగే మొదటి సినిమాతో మంచి విజయం సాధించిన తర్వాత సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన హీరోయిన్లు కూడా ఉన్నారు. అలాంటి వారిలో తరుణ్ సరసన నువ్వేకావాలి సినిమా లో నటించిన రిచా మల్లాడ్ కూడా ఒకరు

ఇక ప్రస్తుతం ఈమె ఎక్కడ కూడా కనిపించలేదనే చెప్పాలి. కానీ ఏం చేస్తుంది.. ఎక్కడ ఉంది .. అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆమె అభిమానులు మాత్రం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే 1980 ఆగస్టు 30వ తేదీన జన్మించిన ఈమె నటన మీద ఆసక్తితో సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. మొదటిసారి తెలుగు, తమిళ్, కన్నడ , హిందీ , మలయాళ భాషల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాదు 200కు పైగా యాడ్ ఫిలిమ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె నువ్వే కావాలి సినిమా ద్వారా ఒక్కసారిగా ప్రేక్షకులలో మంచి స్థానం సంపాదించుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతుంది అనుకున్నా కానీ అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది. 2011లో హిమాన్షు బజాజ్ అనే వ్యక్తి తో వివాహం జరగగా.. 2013లో వీరికి ఒక కొడుకు కూడా జన్మించాడు. 2016లో మలుపు అనే సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించినప్పటికీ.. పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం 41 ఏళ్ల వయసులో హీరోయిన్ గా రాణించక పోయినప్పటికీ బాలీవుడ్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేస్తూనే మరొకవైపు భర్త, పిల్లలను చూసుకుంటూ జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version