వైసీపీకి మరోసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు !

-

వైసీపీకి మరోషాక్‌ ఇచ్చారు ఏపీ పోలీసులు. తాడేపల్లిలో వైసీపీ పార్టీ కార్యాలయానికి మరోసారి నోటీసులు ఇచ్చారు ఏపీ పోలీసులు. అగ్నిప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలని కోరారు ఏపీ పోలీసులు.

AP Police once again issued notices to the YCP party office in Tadepalli

సీసీ కెమెరా డేటా, పార్కింగ్‌లోని వాహనాల వివరాలతో ఉ.10 గంటలకు తాడేపల్లి పీఎస్‌కు రావాలని తెలిపారు పోలీసులు. ఇక ఇటీవలే తాడేపల్లిలో వైసీపీ పార్టీ కార్యాలయానికి మరోసారి నోటీసులు ఇచ్చారు ఏపీ పోలీసులు. వారంలో రెండు సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి దీనిపై జగన్ మోహన్ రెడ్డి టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

కాగా… ఏపీలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీలో చేరేందుకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేతలు సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version