జయలలిత బయోపిక్.. ‘ది ఐరన్ లేడీ’

-

తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకురాలు తమిళ ప్రజల చేత అమ్మ అని పిలుపించుకున్న జయలలిత లాస్ట్ ఇయర్ మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఆమె జీవిత కథను సినిమాగా తీయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు. అసలే బయోపిక్ సినిమాలకు బాగా క్రేజ్ వచ్చిన ఇలాంటి టైంలో ఒకరు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు జయలలిత బయోపిక్ చేస్తున్నట్టు ఎనౌన్స్ చేశారు.

కాని వారిలో ముందడుగు వేశారు ప్రియదర్శిని.. అమ్మ బయోపిక్ కు ది ఐరన్ లేడీ అనే టైటిల్ పెట్టారు. ట్యాగ్ లైన్ గా ‘ఏ స్టోరీ ఆఫ్ రివల్యూషనరీ లేడీ’ అని ఉంచారు. సినిమా టైటిల్ తో పాటుగా త్వరలో అట్టహాసంగా మొదలు పెడుతున్నారని చెప్పేలా ఓ పొస్టర్ వదిలారు. టైటిల్ బ్యాక్ డ్రాప్ లో తమిళనాడు అసెంబ్లీ కనిపిస్తుంది. మురుగదాస్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కోలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది.

సినిమాలో జయలలితగా వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుందని తెలుస్తుంది. జయలలిత గురించి హిల్లరీ క్లింటన్.. ఆమె ఎవరితో పోల్చలేనిది.. సమర్ధవంతమైన.. బలమైన నాయకురాలు.. మహిళల పురోగతికి కృషి చేసిన వ్యక్తి అనే మెసేజ్ ను కూడా పోస్టర్ లో పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version