‘ ది కాశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిపై కేసు నమోదు

-

ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సినిమా ‘ ది కాశ్మీర్ ఫైల్స్’. 1990లో కాశ్మీర్ లో పండిట్ల ఊచకోత, వలసలపై వివేక్ అగ్రిహోత్రి దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. సినిమా విడుదలతోనే సెన్సెషన్ క్రియేట్ చేసింది. లో బడ్జెట్ సినిమా వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ రెండు వారాల్లోనే రూ. 200 కోట్లను వసూలు చేసింది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి నటన సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఇదిలా ఉంటే ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలు కాశ్మీర్ ఫైల్స్ సినిమాను తెగ ప్రశంసిస్తున్నారు. ఏకంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు టాక్స్ ఫ్రీ ఇవ్వడంతో పాటు అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు సినిమా చూసేందుకు సెలవులను కూడా ఇచ్చింది. 

ఇదిలా ఉంటే తాజాగా ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి వివాదంలో చిక్కుకున్నారు. ‘ భోపాలి అంటే స్వలింగ సంపర్కుడు’ అన్న వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. శనివారం వివేక్ అగ్నిహోత్రిపై ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. భోపాల్ కు చెందని ఓ ఎంటర్‌టైన్‌మెంట్ జర్నలిస్టు ఈ కేసు పెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 1860లోని 153A, 153B, 295A, 298, 500, 505(2) కింద భోపాల్ ను అవమానపరిచినందుకు చర్యలు తీసుకోనున్నారు.

“నేను భోపాల్‌లో పెరిగాను, కానీ నేను భోపాలీని కాదు. ఎందుకంటే భోపాలీకి వేరే అర్థం ఉంది. మీరు ఏ భోపాలీని అయినా అడగవచ్చు. ఎవరైనా అతను భోపాలీ అని చెబితే, సాధారణంగా అతను స్వలింగ సంపర్కుడని అని అర్థం.” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వివేక్ అగ్నిహోత్రి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version