రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కేబినెట్ విస్తరణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొందరి పేర్లను హస్తినకు సైతం పంపించింది. అయితే, కొందరికి తమకు కేటాయించబోయే శాఖల గురించి సైతం సమాచారం అందించినట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీ లాబీలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమార్‌కు పలువురు విషెస్ సైతం తెలిపారు.
ఈ క్రమంలోనే మంత్రి పదవి కోసం నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.నిన్న అధిష్టానంతో ఆయన భేటీ అయినట్లు తెలిసింది. ఏఐసీసీ అధ్యకుడు ఖర్గే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షీతో ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం.తనకు మంత్రి పదవి ఇవ్వాలని దొంతి మాధవరెడ్డి కోరినట్లు తెలుస్తోంది.