IPL 2022 CSK vs KKR : టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కత్త‌.. ఇరు తుది జ‌ట్లు ఇవే

-

ఐపీఎల్ 2022 మెగా టోర్నీ అట్టాహాసంగా ప్రారంభం అయింది. క్రీడా అభిమానులు ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ క్రేజీ లీగ్ కాసేప‌టి క్రితం మొద‌లైంది. నేడు మొద‌టి మ్యాచ్ ర‌వీంద్ర జ‌డేజా సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్, శ్రేయ‌స్ అయ్యార్ నాయ‌కత్వంలోని కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌పడుతున్నాయి. కాగ ఈ మ్యాచ్ కు సంబంధించి టాస్ కూడా కాసేప‌టి క్రితం జ‌రిగింది.

కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు టాస్ నెగ్గింది. దీంతో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్యార్.. మొద‌ట బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు మొదట బ్యాటింగ్ చేయ‌నుంది. కాగ ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో 7 :30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. ఇరు తుది జ‌ట్లు ఇలా ఉన్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జ‌ట్టు :
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా ( కెప్టెన్ ), శివమ్ దూబే, ఎంఎస్ ధోని ( వికెట్ కీప‌ర్ ), డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, తుషార్ దేశ్‌పాండే

కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జ‌ట్టు :
వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్ ( కెప్టెన్ ), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీప‌ర్ ), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చకరవర్తి

Read more RELATED
Recommended to you

Exit mobile version