ది కేరళ స్టోరీ మేకర్స్ కు బిగ్ షాక్.. పలుచోట్ల షోలు బంద్..

-

బిగ్ షాక్: విడుదలకు ముందే వివాదాలు సృష్టించిన సినిమా ఇది కేరళ స్టోరీ ఏప్రిల్ 26న ఈ సినిమా ట్రైలర్ విడుదలై వివాదాస్పదంగా మారింది ఈ సినిమా ఒక మతాన్ని కించపరిచే విధంగా ఉందంటూ నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే అంతేకాకుండా సినిమా విడుదలను సైతం ఆపేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే వీటన్నిటిని దాటుకుంటూ ఈ రోజు సినిమా ప్రేక్షకులు ముందుకి వచ్చింది కాగా పలు థియేటర్లలో ఈ సినిమాకి అడ్డంకులు ఎదురయ్యాయి..

ఈరోజు విడుదలైన ది కేరళ స్టోరీ సినిమాను తిరువనంతపురంలో పివిఆర్ సినిమాస్లో షోస్ రద్దు చేశారు.. కొచ్చి పీవీఆర్ సినిమాస్, ఒబెరాన్ మాల్ లో షోలు వేయాల్సి ఉంది. అయితే రెండు చోట్ల ప్రదర్శన రద్దు చేశారు. తిరువనంతపురంలోని పలు మాల్‌ నందు గల పీవీఆర్ సినిమాస్ లో కూడా ప్రదర్శన ఆగిపోయింది. తిరువనంతపురం, కొచ్చి నగరాల్లో కేవలం రెండు లొకేషన్స్ లో ది కేరళ స్టోరీ ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. నిరసనల నేపధ్యంలో కేరళ వ్యాప్తంగా పలు చోట్ల చిత్ర ప్రదర్శన నిలిచిపోయింది.

ది కేరళ స్టోరీ సినిమాను సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా తాజాగా విడుదలైన ట్రైలర్ రాజకీయంగా ప్రకంపనలు రేపింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ది కేరళ స్టోరీ మేకర్స్ పై మండిపడ్డారు. ఇది విద్వేషాలను రెచ్చగొట్టే చిత్రం అన్నారు. సీపీఐ, కాంగ్రెస్ పార్టీలో ఈ చిత్రాన్ని వ్యతిరేకించాయి. 32000 మంది అమ్మాయిలు లవ్ జిహాద్ కి బలయ్యారు. తీవ్రవాదులుగా మార్చడ్డారనేది ఈ చిత్ర సబ్జెక్టు.కేరళకు చెందిన హిందూ, క్రిస్టియన్ మహిళలను ముస్లింలు ఇరాక్, సిరియా దేశాలకు పంపి ISIS ఉగ్రవాదులుగా తయారు చేశారని చూపించినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version