తమిళనాడులో మొదలైన ‘ది కేరళ స్టోరీ’ వార్..

-

కేరళ స్టోరీ: విడుదలకు ముందే ఎన్నో వివాదాలు అడ్డంకులు ఎదుర్కొంటున్న సినిమా ది కేరళ స్టోరీ. ఇప్పటికే దేశం మొత్తం ప్రకంపనాలు సృష్టించిన ఈ సినిమా విడుదలకు ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. కాగా తమిళనాడులో సైతం విడుదలను అడ్డుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ది కేరళ స్టోరీ సినిమా కేరళ ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని అబాసుపాలు చేసే విధంగా ఉందంటూ ఇప్పటికే ఆ రాష్ట్రం మండిపడుతున్న సంగతి తెలిసిందే. కేరళ సీఎం సైతం ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు. కేరళలో ఇటీవల కాలంలో సుమారు 32వేల మంది మహిళలు అపహరణకు గురయ్యారని, వారిలో కొంతమంది బలవంతంగా ముస్లీం మతంలోకి, మరికొందరు ఉగ్రవాదాలుగా మార్చబడ్డారని, అనేక చిత్ర హింసలకు గురిచేయబడ్డారని ఈ సినిమాలో చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విడుదలవుతున్న సినిమా తీవ్రదుమారాన్ని రేపుతుంది ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కాంట్రవర్సీగా మారగా విడుదలకు సైతం ఎన్నో అడ్డంకులు ఏర్పడుతున్నాయి..

ఈ నెల 5న పాన్‌ ఇండియా తరహాలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు తమిళనాడులో సైతం అడ్డంకులు ఏర్పడనున్నట్టు తెలుస్తుంది. సినిమాని విడుదల ఆపేయాలని తమిళనాడు ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ సినిమాకి కేరళలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, తమిళనాడులో విడుదల చేస్తే కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిపాయని సమాచారం. అందుకే తమిళనాడులో `ది కేరళ స్టోరీ` సినిమా విడుదలకు అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి నిఘా సంస్థ సిఫార్సు చేసిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విడుదలకు తమిళనాడులో ఇబ్బందులు మొదలైనట్టే తెలుస్తోంది. మరి తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఆదా శర్మ, సిద్ధి ఇద్రానీ, సోనియా బలానీ, యోగితా బిహానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహించగా విపుల్‌ అమృత్‌ షా నిర్మించారు. హిందీలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మిగిలిన భాషల్లోకి అనువాదం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version