హాట్ టాపిక్ గా ఊర్వశి రౌటేలా రెమ్యూనరేషన్.. కోట్లు కుమ్మరించిన లెజెండ్ హీరో.. 10సినిమాలు చేసినా రానంత..!

-

Urvasi rautela remuneration
Urvasi rautela remuneration

బ్యాక్​గ్రౌండ్​, బ్యాంక్​ బ్యాలన్స్​ ఉండి సినీఇండస్ట్రీలో అడుగుపెట్టినవారు ఎందరో. అలా చాలామంది   సినిమాపై ఉన్న ఆసక్తితో  నటుడిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడా ఆ కోవలోనే తన లక్​ పరీక్షించుకున్నారు  ఓ బిజ్​నెస్​మ్యాన్.​ హీరోగా గ్రాండ్​ సిల్వర్​ స్క్రీన్​ ఎంట్రీ ఇచ్చారు. ఆయనే ది లెజెండ్​ శరవణన్‌. దాదాపు రూ.60కోట్లకు పైగా బడ్జెట్​తో చిత్రం ‘ది లెజెండ్​’ అనే సినిమాతో ఆయన వెండితెర అరంగేట్రం చేశారు.  వ్యాపారవేత్తగా రాణించిన ఆయన 52ఏళ్ల వయసులో కథానాయకుడిగా మారారు. ఒక్కసారిగా భారీ ప్రమోషన్స్‌తో వెలుగులోకి వచ్చారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్​లో ఊర్వశి రౌటేలా కథానాయిక. ఇపుడామె పారితోషికం విషయం హాట్​ టాపిక్​గా మారింది. ఆమె 10 సినిమాలు చేసినా.. రానంత రెమ్యునరేషన్​ను ఊర్వశీకి ఇచ్చారట నిర్మాత శరవణన్‌. ఆ సంగతులు తెలుసుకుందాం.

జె.డి.-జెర్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శరవణ ప్రొడక్షన్స్​ బ్యానర్​పై శరవణన్‌ నిర్మించారు. హ్యారిస్‌ జైరాజ్‌ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో ప్రముఖ నటులు చాలా మంది నటించారు. దాదాపు రూ. 60కోట్ల బడ్జెట్​తో ఈ సినిమాను నిర్మించారు శరవణన్‌.

వాస్తవానికి ఊర్వశీ రౌతాలా.. బాలీవుడ్​లో ఇప్పుడు చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏవీ చేయట్లేదు. అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి.ఒకవేళ ఆమె సినిమా చేస్తే.. రూ.2కోట్లకు మించిన పారితోషికం ఉండదనేది ట్రేడ్​ వర్గాల అంచనా.

అయితే ‘ది లెజెండ్’​ సినిమాకు మాత్రం.. ఊర్వశీ రౌతాలా కూడా ఊహించనంత చెక్​ ఇచ్చారట శరవణన్‌. ఒకరకంగా చెప్పాలంటే.. ఆమెను సినిమాలో నటింపజేసేందుకు.. బ్లాంక్​ చెక్​ ఇచ్చినట్లు సమాచారం.

మొత్తం మీద ‘ది లెజెండ్’లో నటించేందుకు ఆమె దాదాపు రూ. 20కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఇదే నిజం అయితే.. సౌత్​లో ఇదే అత్యధిక పారితోషికం అవుతుంది.

ప్రస్తుతం ట్రెండింగ్​లో ఉన్న చాలా మంది స్టార్​ హీరోలు కూడా రూ.20కోట్ల పారితోషికం అందుకోకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version