కియారా సల్మాన్ కు ఉన్న బంధం ఏంటో తెలుసా?

-

Kiara birthday salmankhan
Kiara

బాలీవుడ్​లో వరుస హిట్లతో దూసుకుపోతోంది బాలీవుడ్​ హాట్​ బ్యూటీ కియారా అడ్వాణీ. తాజాగా ‘జుగ్ జుగ్ జివో’ బ్లాక్​ బస్టర్​తో దూకుడు మీద ఉంది. ప్రస్తుతం శంకర్​- రామ్​చరణ్​ పాన్​ మూవీలో నటిస్తోంది. కాగా, ఆదివారం(జులై 31) కియారా పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులు, సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేఫథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

1992 జులై 31న జన్మించిన కియారా.. టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ బయోపిక్ ‘ధోనీ: ది అన్​టోల్డ్ స్టోరీ’తో సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

కబీర్ సింగ్, షేర్ షా, మేజ్-2, జుగ్ జుగ్ జివో, భూల్​ భులయ్య2 లాంటి వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉంది కియారా.

అడ్వాణీ సినిమా ఇండస్ట్రీలోకి రావడంలో బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్​ హస్తం కూడా ఉంది.

కియారా కుటుంబం.. సల్మాన్​ కుటుంబం చాలా క్లోజ్​ అంట. బాంద్రాలో ఇరు కుటుంబాలు నివసిస్తున్న సమయంలో.. మంచి అనుబంధం ఉండేదట.

కియారా అడ్వాణీ తల్లి జెనీవీవ్ జాఫ్రీ.. సల్మాన్​ ఖాన్​ బాల్య స్నేహితులు అట. తాను హీరో అవుతానని తరచూ.. జాఫ్రీకి చెప్పేవాడట సల్మాన్​ ఖాన్​.

అంతేకాదు.. కియారా అడ్వాణీ ఆంటీ షాహీన్​తో కూడా సల్మాన్​ డేటింగ్​ చేసినట్లు అప్పట్లో బీటౌన్​లో గుసగుసలు వినిపించాయి.

కియారా అడ్వాణీ అసలు పేరు ఆలియా అద్వానీ. కియారా ఇండస్ట్రీకి వచ్చే సమయానికి ఆలియా పేరుతో అప్పటికే ఆలియా భట్​ ఉంది. ఈ క్రమంలో ఆమె స్క్రీన్​ నేమ్​ మార్చాలని సల్మాన్​ సూచించారు.

సల్మాన్​ ఖాన్​ సూచన మేరకు ఆలియా పేరు.. కియారా అద్వానీగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version