ఇండస్ట్రీకి ఇలాంటి డైరెక్టర్ ఒక్కరే ఉంటారు ..ఆ ఒక్కరే పూరి జగన్నాధ్

-

టాలీవుడ్ లో చిత్ర పరిశ్రమకి 20 ఏళ్ళలో ఎంతో మంది డైరెక్టర్స్ వచ్చారు వెళ్ళారు. కాని పూరి జగన్నాధ్ మాత్రమే లోకల్ అంటూ సెటిలయ్యారు. పూరి జగన్నాధ్ అందరిలా కాదు ఎవరికీ సరితూగరు. టన్నులకొద్ది టాలెంట్ .. రాకెట్ కంటే స్పీడ్. 24/7 ఆన్ లో ఉండే మైండ్. ఒక ఐడియా వచ్చిందంటే బొమ్మ పడాల్సిందే. ఒక కథ కొత్తగా రాయాలన్న ఒక హీరోని కొత్తగా చూపించాలన్న పూరి జగన్నాధ్ తర్వాతే ఎవరైనా. 25వేలు చేతికిచ్చి నువ్వు సినిమా ఇండస్ట్రీకెళ్ళు బాగుపడతావు అని అమ్మా నాన్న నమ్మకంగా చెప్పారంటే కొడుకుగా పూరి ఎలాంటి వాడో అర్థం చేసుకోవచ్చు.

 

బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా భోళా శంకరుడు అని ఖచ్చితంగా చెప్పాలసిందే. ఇండస్ట్రీలో హీరో ఎవరైనా తన టార్గెట్ సినిమాని 90 రోజుల్లో రిలీజ్ చేయాల్సిందే. అదే పూరి ని ఈ రోజు ఈ స్థాయిలో నిలుచో బెట్టింది. డిజాస్టర్స్ పడ్డా, బ్లాక్ బస్టర్ వచ్చినా ఒకే నవ్వు. అందులో ఏమాత్రం తేడా ఉండదు. సంపాదించుకున్నదంతా రాత్రికి రాత్రి పోయినా మొండితనం గుండె ధైర్యం మాత్రం పోలేదు. అలాంటి సమయంలోనే బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు.

పూరి లాంటి దర్శకులుంటే ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరికి సరదా తీరిపోద్ది. ఏ హీరోకైనా వాళ్ళ లైఫ్ లో మిగిలి ఉన్న మాస్ ఇమేజ్ లోటు తీరాలంటే అది ఒక్క పూరి జగన్నాధ్ వల్లే సాధ్యమవుతుంది. ఒకే పాయింట్ తో రెండు కథలున్నాయంటే పూరి చెప్పే సమాధానం ఒక్కటే .. అసలు కథలన్ని ఒక్కటే తీసే విధానంలోనే ఆ డైరెక్టర్ క్రియోటివిటి ఉంటుందని. ఇది ముమ్మాటికి నిజం. ఇక పూరి హీరోలు యమా యారగంట్ గా ఉంటారంటే .. హీరో అనే వాడు అలానే ఉండాలనేది ఆయన సమాధానం. అంతేకాదు వరసగా ఫ్లాప్స్ వస్తున్నాయి కదా అని అడిగినా …ఇదంతా జనాలు ఇచ్చిందే వాటిలో కొన్ని ఆస్తులు పోతాయి అంతేకాదా..అంటూ సింపుల్ గా సమాధానం చెప్తారు.

ఇక ఇండస్ట్రీకొచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న పూరి జగన్నాధ్ ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారో అన్ని ఫ్లాపులు ఇచ్చారు. అందుకు కారణం ఆయన గురువు రాం గోపాల్ వర్మ లాగా ఎక్కువగా ప్రయోగాలు చేయడమే. అంతేకాదు తనతో ఉన్న ప్రతీ ఒకరిని ప్రేమగా చూసుకోవడం పూరి లోని గొప్ప గుణం. సహాయంలోను ముందుంటారు. ఇక తన టీం ని సొంత మనుషుల్లా చూడటం అంటే అది కూడా పూరి లో ఉన్న ఒక గొప్ప వ్యక్తిత్వం అనే చెప్పాలి. సక్సస్ లు ఫ్లాపులు కాదు ఆయనకి లెక్క ఎన్ని సినిమాలు తీశామన్నదే. అందుకే ఆయన నుండి సినిమాలు వస్తూనే ఉంటాయి. వరుస ఫ్లాపులొస్తున్నాయని సినిమాలు మానేసిన దర్శకులు ఉన్నారు. కాని పూరి అలా కాదు నేనింతే..ఈ రోజు సక్సస్ వచ్చిందని ఇక చాలు అనుకుంటామా ..లేదు ఒక సినిమా ఫ్లాపయింది ..ఇంటికెళ్ళి పోతామా ..సినిమా సక్సస్ అయినా ఫ్లాపయినా మనం మళ్ళీ సినిమా తీయాల్సిందే. ఎందుకంటే మనకి సినిమా తప్ప ఇంకేమి తెలీదు ..అదే పూరి నిజ జీవితం కూడా.

సక్సస్ వచ్చినా ఫ్లాపొచ్చినా ఆయన ఒక సినిమా తీస్తే ఎన్ని కుటుంబాలు బావుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందరూ ఆయనకి బ్యాంకాంక్ తో అనుబంధం ఎక్కువ అని అనుకుంటారు. మరి ఆయన ఇప్పటికి సహాయం చేస్తున్న రమ ప్రభ గారితో ఉన్నది అనుబంధం కాదా …ఎన్ని కాంట్రవర్సీలున్న తన గురువు రాం గోపాల్ వర్మ ని వదలనిదాన్ని ఏమంటారు అనుబంధం కాదా ..! అందుకే ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్ లాంటి డైరెక్టర్ ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకునేది.

Read more RELATED
Recommended to you

Exit mobile version