‘SSMB29’పై ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టిన నిర్మాణ సంస్థ

-

స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ( SSMB29 ) ఎప్పుడు మొదలవుతుందా అని సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు.  తాజాగా ఈ ప్రాజెక్ట్ కాస్టింగ్‌ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీనిపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇస్తూ నోట్‌ రిలీజ్‌ చేసింది.

‘రాజమౌళి-మహేశ్‌బాబు ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటుల ఎంపికపై రకరకాల వార్తలు వస్తున్నాయి. కొన్ని ఆంగ్ల వెబ్‌సైట్స్‌లో వెలువడిన కథనాలు మా దృష్టికి వచ్చాయి. కాస్టింగ్‌ డైరెక్టర్‌ వీరేన్‌ స్వామి సినిమాలో భాగమైనట్లు రాశారు. అందులో నిజం లేదు. ఈ మూవీకి సంబంధించి ఏ అప్‌డేట్‌ అయినా మేమే ఇస్తాం. ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి వచ్చే అధికారిక ప్రకటనను తప్ప మరే ఇతర అప్‌డేట్‌లను నమ్మొద్దు’ అని శ్రీ దుర్గ ఆర్ట్స్‌ పేర్కొంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘మహారాజ్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇందులో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా, హాలీవుడ్‌ ప్రముఖ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ కీలకపాత్ర పోషించనున్నారని కూడా జోరుగా ప్రచారమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version