వాళ్ల ఆశలపై నీళ్లు చల్లిన నాగబాబు.. సీనియర్లకు తప్పని నిరాశ..

-

ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి ఒక్కరూ మంత్రి అవ్వాలని కోరుకుంటారు.. ఒక్క చాన్స్ ఇస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామని.. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని చెబుతూ ఉంటారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎంగా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మరో 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు..

ఏపీ కేబినెట్లో ఖాళీగా ఉన్నది ఒకే ఒక బెర్త్ కోసం తలలు పండిన సీనియర్లు ప్రయత్నించారు.. ఇప్పటికే మంత్రివర్గంలో జూనియర్లకు కూడా చంద్రబాబు అవకాశం కల్పించిన నేపధ్యంలో.. తమకు కూడా మంత్రియోగం ఉందని.. కొందరు నేతలు చంద్రబాబును కలిసి విజ్ణప్తులు చేశారు.. తమను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.. ఇదే సమయంలో సీఎం చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయం సీనియర్లకు అసంతృప్తిని మిగిల్చింది..

ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి పదవి కోసం శ్రీకాకుళం నుంచి విశాఖ దాకా టీడీపీలో చాలా మంది ఆశావహులు ప్రయత్నాలు చేశారు. కూన రవికుమార్, కిమిడి కళా వెంకట్రావు లు తమకి మంత్రి పదవి ఖాయమంటూ ప్రచారం చేసుకున్నారు.. అలాగే ఎస్. కోటకు చెందిన కోళ్ళ లలిత కుమారి కూడా ఆశపడ్డారు.. రాజుల కోటాలో మంత్రి పదవి దక్కుతుందని అదితి గజపతిరాజు భావించారు..విశాఖ జిల్లాలో అయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు మొదటి వరసలోనే ఉంటుందని ఆయన అభిమానులు భావించారు. మరో మాజీ మంత్రి బండారు కూడా 25 ఏళ్ల తర్వాత మరోసారి మంత్రి కావచ్చునని ఆశించారు .

నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డులు కూడా మంత్రి పదవిని ఆశించారు.. పార్టీలో చేరే సమయంలో తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని కోటంరెడ్డి తన అనుచరుల వద్ద చెప్పుకున్నారట. దీంతో ఒక్క ఖాళీ తమ కోసమే ఎదురుచూస్తుందని అందరూ భావించారు.. కానీ చంద్రబాబు వారందరికీ షాక్ ఇచ్చారు.. ఎవ్వరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు.. చంద్రబాబు క్యాబినెట్ లో 25వ మంత్రి కాబోతున్నారు.. దీంతో మంత్రి పదవి ఆశించిన నేతలందరూ.. ఆ ఒక్క ఛాన్స్ కూడా మిస్ అయిందని బాదపడుతున్నారట..

Read more RELATED
Recommended to you

Exit mobile version