తండేల్ నుంచి ‘శివ శక్తి’ సాంగ్ వచ్చేసింది

-

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో భారీగా తెరకెక్కుతున్న సినిమా ‘తండేల్’. గీత ఆర్ట్స్ బ్యానర్ పై లో బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే తండేల్ సినిమా నుంచి టీజర్, బుజ్జితల్లి సాంగ్ రిలీజ్ చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.

తాజాగా  తండేల్ సినిమా నుంచి శివుడి సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘నమో నమో నమః శివాయ..’ అంటూ సాగిన శివశక్తి పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ పాటను జొన్నవిత్తుల రామ లింగేశ్వరరావు రాయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో తెలుగులో అనురాగ్ కులకర్ణి, హరిప్రియ అద్భుతంగా పాడారు. హిందీలో దివ్య కుమార్, సలోని థక్కర్ పాడగా.. తమిళ్ లో మహా లింగం, హరిప్రియ పాడారు. ఈ సాంగ్ ని తెలుగుతో పాటు తమిళ్, హిందీలో రిలీజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం..  మీరు కూడా ఈ పాట వినేయండి.

Read more RELATED
Recommended to you

Latest news