గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తొలి రోజు 6 షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. గేమ్ ఛేంజర్ భారీ బడ్జెట్ మూవీ కావడంతో దానికి టికెట్ రేట్లు పెంచి అమ్ముకునే అవకాశం కల్పించాలంటూ కొద్ది రోజుల కిందటే ఏపీకి వెళ్లి ప్రభుత్వాన్ని కోరారు నిర్మాత దిల్ రాజు. సినిమాటోగ్రఫషీ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసి ఈ మేరకు రిప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తూ.. జీవో జారీ అయింది. జీవో ప్రకారం.. జనవరి 09న అర్థరాత్రి 1 గంటలకు స్పెషల్ బెనిఫిట్ షో వేసుకునే అవకాశం కల్పించారు. ఆ షోలకు జీఎస్టీతో కలిపి రూ.600 టికెట్ రేటు ఫిక్స్ చేశారు. అదేవిధంగా జనవరి 10వ తేదీ 6 షోలు వేసుకునేలా అనుమతి ఇచ్చారు. ఉదయం నాలుగు గంటల ఆట నుంచి వేసుకునేలా ఫర్మిషన్స్ ఇచ్చారు. మల్టీప్లెక్స్ లకు జీఎస్టీతో కలిపి రూ.175, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రూ.135 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రోజుకు 5 షోలు వేసుకునే అవకాశం కల్పించారు. టికెట్ రేట్లు మొదటి రోజు ఎంత ఉంచారో 23వ తేదీ వరకు అంతే పెంచుకునేలా అవకాశం కల్పించారు.