విశాఖ కు త్వరలోనే మెట్రో రైలు వస్తుందని గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. నేవీ డే సందర్భంగా విశాఖ సాగర తీరంలో ప్రదర్శించిన విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు కొనియాడారు. రాష్ట్రానికి విశాఖ ఆర్థిక రాజధాని అని.. త్వరలోనే మెట్రో రైలు ప్రారంభిస్తామని వెల్లడించారు. గతంలో ఎన్నో సార్లు నగరానికి వచ్చినప్పటికీ ఈసారి సంతోషంగా ఉందని తెలిపారు. నావికా దళ క్రమ శిక్షణ చూస్తుంటే ముచ్చటేస్తుందన్నారు. హుద్ హుద్ తుఫాన్ సమయంలో నేవి సహకారం మరిచిపోలేమన్నారు.
విశాఖ అంటేనే ప్రశాంతతకు మారు పేరు అని తెలిపారు. విశాఖను టెక్నాలజీ హబ్ గా తయారు చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు. డిఫెన్స్ పరంగా స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నేవిని చూస్తే.. వేరే వాళ్లు భయపడేవిధంగా మన నావి వాళ్లు పని చేస్తున్నారు. 1971లో విశాఖ నేవీ పాకిస్తాన్ తో యుద్ధంలో విజయం సాధించిందని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు.