నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో వచ్చిన చిత్రం బింబిసారా. ఆగస్టు 5వ తేదీన భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంటుంది. అంతేకాదు ఇప్పటివరకు థియేటర్లకు ప్రేక్షకులను ఎలా రప్పించాలో అని నిర్మాతలు ఎదురుచూస్తున్న నేపథ్యంలో బింబిసారా సినిమాతో నిర్మాతలకు ఆ డౌటు కాస్త తీరిపోయింది అని చెప్పవచ్చు. కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు సినిమా చూడడానికి థియేటర్ల కు వస్తారు అని ఈ సినిమా నిరూపించింది. ఇక ఈ సినిమా దర్శకుడు మల్లిడి వశిష్ట మొదటిసారి ఈ సినిమా కథను ఒక మాస్ హీరోకు వినిపించారట. వశిష్ట ప్రేమ లేఖ రాశా అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమైనా.. తోటి వయసులో ఉన్న ఎంతోమంది హీరోలతో ఈయనకు మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. ఆ పరిచయంతోనే ఒక స్టార్ హీరోకు కథ వినిపిస్తే ఆయన ఒక భయం కారణంగా ఒప్పుకోలేదట.బింబిసార కాన్సెప్ట్ మొదట రిజెక్ట్ చేసిన హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ అని సమాచారం. రవితేజకి – వశిష్టకి మంచి పరిచయం ఏర్పడింది. అందుకే ఈ సినిమా కథ ను మొదట రవితేజకి వినిపించగా.. కొన్ని రోజులపాటు చర్చలు కూడా జరిపాడు. అయితే అందులో నెగటివ్ షేడ్స్ ఎక్కువగా ఉన్నాయని , ఒక చిన్న పాపను చంపే క్యారెక్టర్ అతనికంతగా నచ్చలేదట. దానితోపాటు కొత్త దర్శకుడు విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాను ఎంతవరకు హ్యాండిల్ చేయగలడు అనే విషయంలో కూడా కాస్త భయపడ్డాడట రవితేజ. అందుకే ఆ సినిమాను చేయడానికి రవితేజ ఒప్పుకోలేదని తెలుస్తోంది.
ఇకపోతే కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడంలో కళ్యాణ్ రామ్ ముందు ఉంటాడు అని తెలుసుకున్న వశిష్ట వెంటనే అతనిపై నమ్మకంతో కళ్యాణ్ రామ్ దగ్గరికి వెళ్లారు. ఇక కళ్యాణ్ రామ్ కి కూడా నమ్మకంగా అనిపించడంతో , సొంతంగా గ్రాఫిక్స్ కు సంబంధించిన స్టూడియో కూడా ఉంది .కాబట్టి పక్క ప్రణాళికలను సిద్ధం చేసుకుని ఆ తర్వాత సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.