ప్రస్తుత కాలంలో చాలామంది సినిమాలలో సక్సెస్ కావాలి అని ఎన్నో ఉన్నత ఉద్యోగాలను, పదవులను వదులుకొని వస్తుంటే.. కానీ ఇక్కడ ఒక హీరో మాత్రం రాజకీయాల కోసం సినీ జీవితాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనే తమిళ హీరో ఉదయ్ నిధి.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకుగా, హీరోగా పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన తమిళనాడులో జరిగిన గత ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అయినా సరే ఆయన ఎమ్మెల్యేగా ఒకపక్క పదవి బాధ్యతలు చేపట్టి.. మరొకవైపు సినిమా పైన ఉన్న ఆసక్తిని చంపుకోలేక ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అయితే ఇటీవల ఉదయనిధి స్టాలిన్ యూత్ వెల్ఫేర్ క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మంత్రి అయిన తర్వాత సినిమాలేవి కూడా ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన మామన్నన్ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రం ఆడియో లాంచ్ ను చెన్నైలో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమలహాసన్ హాజరయ్యారు
ఇకపోతే ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మామన్నన్ లాంటి ఒక మంచి సినిమా నా చివరి సినిమా కావడం సంతోషంగా ఉంది. కమలహాసన్ నిర్మాణంలో కూడా ఒక సినిమా చేయాలని ఉంది కానీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక సినిమాలలో నటించడం సరికాదు అని అభిప్రాయపడుతున్నాను. అందుకే ఇక సినిమాలు ఆపేస్తున్నాను అంటూ ఆయన వెల్లడించారు. ఇకపోతే ఉదయనిది స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానులంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోను మళ్ళీ తెరపై చూడలేమేమో అన్న ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.